గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: గురువారం, 25 ఏప్రియల్ 2019 (17:16 IST)

గజదొంగలు... హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లిపోయారు...

హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లారు దుండగులు. ఎంజేబియస్ దగ్గరున్న గౌలిగూడ బస్టాప్‌లో మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో నైట్‌ హాల్ట్‌ కోసం బస్సును నిలిపాడు డ్రైవర్. అంతే.. అది మాయమైపోయింది. ఎవరు ఎత్తుకెళ్లారు.. ఏం చేశారనే సమాచారం అటు ఆర్టీసీ అధికారులకు, ఇటు పోలీసులకు తెలియడం లేదు. 
 
అయితే.. మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో తూప్రాన్‌ ప్రాంతంలో ఆ సిటీ బస్సు తిరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఆ మార్గంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. దాదాపు 24 గంటలు కావస్తున్నా కుషాయిగూడ డిపోకు చెందిన బస్సు ఆచూకీని తెలుసుకోలేకపోయారు...