శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Modified: శుక్రవారం, 22 మార్చి 2019 (15:34 IST)

కోపంలో భర్త మర్మాంగాన్ని కోసి, దాన్ని అతడిని తీసుకుని భార్య....

తన కోపమే తన శత్రువు అంటుంటారు. అది నిజమే. ఆ కోపాన్ని అదుపులో పెట్టుకుంటే ఎలాంటి అనర్థాలు జరుగవు. కానీ ప్రదర్శిస్తే మటుకు అంతా నష్టమే జరుగుతుంది. ఇలా తీవ్రమైన ఆవేశంతో ఓ భార్య చేసిన పని భర్త ఆసుపత్రి పాలవగా భార్య జైలు పాలైంది. 
 
అసలు ఏం జరిగిందంటే... హైదరాబాద్ ఎల్బీ నగర్‌లో గత నాలుగేళ్లుగా షేర్ సింగ్, సంతోషి నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా వున్నారు. ఐతే భర్తకు తాగుడు వ్యసనం వుంది. మద్యం తాగితే చాలు.... భార్యతో గిల్లికజ్జాలు పెట్టుకుంటూ విసిగిస్తుంటాడు. ఎప్పటిలాగే తాగి వచ్చిన షేర్ సింగ్ భార్యతో ఓ సిల్లీ విషయంపై గొడవకు దిగాడు. మాటామాటా పెరిగింది. 
 
తీవ్ర ఆగ్రహంతో అతడి భార్య వంటగదిలో వున్న కత్తిని తీసుకుని భర్త మర్మాంగాన్ని కోసేసింది. దీనితో అతడు కుప్పకూలి విలవిలలాడిపోయాడు. ఆ తర్వాత ఆమె కూడా బోరుమంటూ ఏడుస్తూ... భర్తను, కోసిన మర్మాంగాన్ని తీసుకుని పరుగుపరుగున ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లింది. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా వుందని వైద్యులు తెలిపారు. కాగా భర్తపై దాడి చేసి మర్మాంగాన్ని కోసినందుకు భార్యపై ఐపీసి సెక్షన్ 327 కింద పోలీసులు అరెస్టు చేశారు.