శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 21 మార్చి 2019 (17:43 IST)

ఫోటోలకు ఫోజులిస్తుంటే... ఎత్తిపడేసిన రాకాసి అల (Video)

చాలా మందికి ఫోటోలంటే అమితమైన పిచ్చిఉంటుంది. అందుకే ప్రాణానికి ముప్పు ఉందని తెలిసినా ప్రమాదరకమైన ప్రాంతాల్లో నిలబడి ఫోటోలు తీసుకుంటారు. ఇటీవలి కాలంలో సెల్ఫీల పిచ్చి ఎక్కువైంది. ఈ తరహా సెల్ఫీలు తీస్తూ ప్రాణాలు కోల్పోతున్న వారు అనేక మంది లేకపోలేరు. తాజాగా ఓ యువతి ఫోటోకు ఫోజులిచ్చే సమయంలో ఓ రాకాసి అల ఎత్తిపడేసింది. 
 
ఇండోనేషియా బాలి సముద్రతీరంలో నుసా లెంబోన్గాన్ అనే ఐలాండ్‌లో ఈ సంఘటన జరిగింది. ఈ ఐలాండ్‌ నిత్యం పర్యాటకులతో సందడిగా ఉంటుంది. అక్కడి ప్రకృతి అందాలకు పర్యాటకులు పరవశించిపోతారు. ఆ అందాలను తమ కెమెరాల్లో బంధించాలని చాలా మంది పోటీపడుతుంటారు. 

 
ఈ సందర్భంగా ఓ యువతి సముద్రాన్ని ఆనుకుని ఉన్న రాతి కొండపై నిలుచుని ఫొటోకు పోజిచ్చింది. ఇంతలో ఓ పెద్ద కెరటం రాతి కొండను తాకింది. ఆ కెరటం వేగానికి ఆ యువతి ఎగిరిపడింది. అదృష్టంకొద్ది ఆమె సముద్రంలోకి జారుకోలేదు. స్వల్ప గాయాలతో బయటపడింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది.