శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సందీప్
Last Updated : బుధవారం, 20 మార్చి 2019 (18:12 IST)

మూడ్ సరిగ్గా లేదని కన్నకూతురిని బిల్డింగ్ నుంచి పడేసింది..!

మూడ్ సరిగ్గా లేదని కన్నకూతుర్ని బిల్డింగ్‌లో నుండి క్రింద పడేసిందో యువతి. ఆ తర్వాత ఏం ఆలోచించిందో ఏమో ఆమె కూడా దూకేసింది. ఈ ఘటన రష్యాలో చోటుచేసుకుంది. కొంత కాలంగా అక్కడ దట్టంగా కురుస్తున్న మంచు కారణంగా ప్రాణాలతో బయటపడ్డారు. దక్షిణ రష్యాలోని యూఎఫ్ఏ ప్రాంతానికి చెందిన ఓ యువతికి ఇద్దరు కూతుళ్లున్నారు. 
 
రెండేళ్ల వయస్సు ఉన్న రెండవ కూతురితో కలిసి ఇంట్లో ఉంది ఆ మహిళ. ఆ సమయంలో ఎందుకో ఆమెకు మూడ్ బాగాలేదు. దానికితోడు అప్పుడే పాప ఏడుపు మొదలెట్టడంతో చాలా చిరాకు వచ్చింది. వెంటనే పాపను 9 అంతస్థుల బిల్డింగ్ మీద నుండి తోసేసింది. ఆ తర్వాత ఆమె కూడా అక్కడ నుండి దూకేసింది. అయితే దట్టంగా పేరుకుపోయిన మంచులో పడి కూరుకుపోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు. 
 
స్థానికులు అది గమనించి ఇద్దరినీ ఆసుపత్రిలో చేర్పించారు. కిటికీలో నుండి జారిపడి ఉండవచ్చని భావించిన పోలీసులు ఆమెను విచారించగా అసలు విషయం చెప్పింది. ఆమె చెప్పిన విషయాలు విని షాక్కైన పోలీసులు నిందితురాలిపై కేసు నమోదు చేసారు. రష్యా చట్టాల ప్రకారం ఆమె చేసిన నేరానికి 5 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.