శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి
Last Updated : బుధవారం, 20 మార్చి 2019 (11:01 IST)

వాట్ ఎ టాలెంట్... 'కన్నా నిదురించరా.. నా కన్నా నిదురించరా..' సితార స్టెప్పులు

సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానులతో పెద్దగా ఇంటరాక్ట్ కాకపోయినప్పటికీ తన ముద్దుల కూతురు సితార గురించి అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అటు భార్య నమ్రత కూడా పిల్లల గురించి కేర్ తీసుకుంటూ వారి అప్‌డేట్స్ గురించి అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటుంది. 
 
తాజాగా మహేష్ బాబు తన గారాలపట్టి సితార డ్యాన్స్ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసి "వాట్ ఎ టాలెంట్" అంటూ కితాబిచ్చారు. సితార తమ ఇంట్లోని జిమ్‌లో 'బాహుబలి-2' ద కన్‌క్లూజన్‌ సినిమాలోని ‘కన్నా నిదురించరా.. నా కన్నా నిదురించరా..’ పాటకు ఎంతో చక్కగా నృత్యం చేసి ఆకట్టుకుంది. 
 
కొంతకాలం క్రితం సితారను నృత్య శిక్షణలో చేర్పించినట్లు నమ్రత పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రముఖ సాంప్రదాయ నృత్యకారులైన అరుణ భిక్షు దగ్గర సితార నృత్యం నేర్చుకుంటూ ఇప్పటికే ఫస్ట్ లెవల్ విజయవంతంగా పూర్తి చేసింది. తన ముద్దుల కూతురి అభినయిస్తూ చేసిన ఈ నృత్యానికి ఫిదా అయిపోయిన మహేష్ తన ట్విట్టర్ ఖాతాతో ఈ వీడియోను పోస్ట్ చేయగా వైరల్‌గా మారిపోయింది.