మహర్షి టీజర్ విడుదలకు ముహుర్తం కుదిరింది..!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ మహర్షి. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అశ్వనీదత్, దిల్ రాజు, పీవీపీ సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహేష్ సరసన పూజా హేగ్డే నటిస్తుంటే..అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల చెన్నైలో జరిపిన షూటింగ్ తో టాకీ పార్ట్ మొత్తం పూర్తయ్యింది. రెండు పాటలను మాత్రమే చిత్రీకరించవలసి వుంది. ఏప్రిల్ రెండవ వారంలో ఈ పాటలను చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు.
ఇక అసలు విషయానికి వస్తే... ఈ మూవీ టీజర్‌ను ఉగాది కానుకగా ఏప్రిల్ 6న రిలీజ్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే అఫిషియల్‌గా ఎనౌన్స్ చేయనున్నారు. ఈ ప్రెస్టేజీయస్ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలోని ప్రతి పాట విశేషంగా ఆకట్టుకునేలా ఉంటుందట. మే 9న భారీ స్ధాయిలో మహర్షి చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. భరత్ అనే నేను చిత్రం వలే మహర్షి చిత్రం కూడా సంచలనం సృష్టిస్తుందేమో చూడాలి.