1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Ram Charan acts in Pawan Kalyan's Banner

బాబాయ్ పవన్ బ్యానర్లో అబ్బాయ్ చరణ్‌ మూవీ, ఇంతకీ డైరెక్టర్ ఎవరు..?

Ram Charan
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న ఆర్ఆర్ఆర్ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలసి చరణ్ నటిస్తుండటంతో ఈ భారీ మల్టీస్టారర్ పైన అటు అభిమానుల్లోను, ఇటు ఇండస్ట్రీలోను భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
 
అయితే... ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్‌తో సినిమా చేయనున్నట్టు అఫిషియల్‌గా ఎనౌన్స్ చేసాడు కానీ.. చరణ్‌ మాత్రం తదుపరి చిత్రం ఏంటి అనేది అఫిషియల్‌గా ఎనౌన్స్ చేయలేదు.
 
 దీంతో ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్‌ చేయబోయే సినిమా ఎవరితో అనేది ఆసక్తిగా మారింది. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు చరణ్‌ నెక్ట్స్ మూవీ గురించి కొంతమంది దర్శకుల పేర్లు తెర పైకి వచ్చాయి.
 
తాజాగా బాబాయ్ పవన్ కళ్యాణ్‌ బ్యానర్లో అబ్బాయ్ చరణ్‌ మూవీ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. పవన్ బ్యానర్లో నితిన్ ఛల్ మోహన రంగ అనే సినిమా చేసాడు కానీ.. చరణ్‌ ఇప్పటివరకు సినిమా చేయలేదు. ఇప్పుడు చరణ్‌తో సినిమా నిర్మించడానికి పవన్ ప్లాన్ చేస్తున్నాడని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది.
 
అయితే.. ఈ క్రేజీ మూవీకి డైరెక్టర్ ఎవరంటే... మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు వినిపిస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా కంప్లీట్ అయిన తర్వాత చరణ్‌తో త్రివిక్రమ్ సినిమా ఉంటుందని.. ఆ సినిమాన పవన్ కళ్యాణ్‌ నిర్మిస్తారని తెలిసింది. ఇదే కనుక జరిగితే.. మెగా ఫ్యాన్స్‌కి పండగే...!
About Writer
శ్రీ
తర్వాతి కథనం
బీజేపీ తమిళనాడు రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబరుగా నమిత నియామకం