కమల్ - గౌతమి బ్రేకప్... మధ్యలో రమ్యకృష్ణ..?
తను కమల్ హాసన్ నుంచి విడిపోవడం చాలా బాధాకరంగా ఉందంటూ ఆయనతో సహజవనం చేస్తూ వచ్చిన నటి గౌతమి వెల్లడించిన సంగతి తెలిసిందే. ఐతే ఆమె కమల్ హాసన్ నుంచి ఎందుకు విడిపోతున్నది వివరంగా చెప్పలేదు. ఈ నేపధ్యంలో కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రకరకాల గుసగుసలు వినిపిస్తున్
తను కమల్ హాసన్ నుంచి విడిపోవడం చాలా బాధాకరంగా ఉందంటూ ఆయనతో సహజవనం చేస్తూ వచ్చిన నటి గౌతమి వెల్లడించిన సంగతి తెలిసిందే. ఐతే ఆమె కమల్ హాసన్ నుంచి ఎందుకు విడిపోతున్నది వివరంగా చెప్పలేదు. ఈ నేపధ్యంలో కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. తొలుత వీరి బ్రేకప్‌కు నటి శ్రుతి హాసన్ అని చెప్పుకున్నారంతా.
కాస్ట్యూమ్స్ విషయంలో శ్రుతి హాసన్-గౌతమిల మధ్య మాటలు వచ్చాయనీ, ఆ విషయంలో కమల్ శ్రుతికి మద్దతు పలికారన్నది తెలిసిందే. తాజాగా మరో వార్త హల్చల్ చేస్తోంది. అదేమిటంటే... నటి రమ్యకృష్ణ శభాష్ నాయుడు చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో కమల్ హీరో. ఈ చిత్రానికి కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా గౌతమి వ్యవహరించారు.
ఐతే ఈమధ్య కాస్ట్యూమ్స్ విషయంలో గౌతమి-రమ్యకృష్ణకు గొడవ జరిగిందట. ఈ గొడవలో కూడా కమల్ తలదూర్చడమే కాకుండా రమ్యకృష్ణకు సపోర్ట్ చేశారట. గతంలో శ్రుతి హాసన్‌కు ఇలాగే సపోర్ట్ చేయడమూ, తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న అనుమానంతో గౌతమి బ్రేకప్ చెప్పిందని కోలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు.
తర్వాతి కథనం
