1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Sai Dharam Tej To Get Married In November

Sai Dharam Tej: నవంబరులో సాయి ధరమ్ తేజ్ వివాహం.. గోప్యంగా వధువు వివరాలు..?

Sai Dharam Tej
Sai Dharam Tej
యువ కథానాయకుడు సాయి ధరమ్ తేజ్ త్వరలో వివాహం చేసుకోబోతున్నారు. 2026 నవంబర్‌లో తన వివాహం జరగనున్నట్లు ఆయన గతంలోనే వెల్లడించారు. అయితే, వధువుకు సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచారు. వివాహానికి ముందు సాయి ధరమ్ తేజ్ స్వయంగా అధికారిక ప్రకటన చేయనున్నారు. 
 
గతంలో తన ప్రేయసితో విడిపోయిన తర్వాత తాను చాలా కష్టమైన కాలాన్ని ఎదుర్కొన్నానని ఆయన గతంలోనే పేర్కొన్నారు. సాయి ధరమ్ తేజ్ దాదాపు రెండేళ్లుగా సంబరాల ఏటి గట్టు అనే చిత్రం కోసం పని చేస్తున్నారు. రోహిత్ కె.పి. దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను హనుమాన్ నిర్మాతలు నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. 
 
ఇది ఆయన కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం కాగా, 2027 సంక్రాంతికి విడుదల కానుంది. వీటితో పాటు, తేజ దర్శకత్వంలో మరో చిత్రానికి కూడా ఆయన సంతకం చేశారు. అనిల్ సుంకర నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
RC 17 Update: రామ్ చరణ్, సుకుమార్‌ల ఆర్‌సి17 పూజా కార్యక్రమం అక్టోబర్ 26 లేదా 27 తేదీలలో