రూంలోకి వెళ్ళి ఆ పని చేస్తేనే తమన్నా ఫ్రీ అవుతుందట...
అటు తెలుగు, ఇటు తమిళ చిత్రాల్లో నటిస్తూ బిజీబిజీగా గడుపుతోంది మిల్కీ బ్యూటీ తమన్నా. సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న తమన్నాకు బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టమట. తెల్లగా కనిపించే తనకు నల్ల దుస్తులు ఎక్కువగా వేసుకోవమంటే చాలా ఇష్టమని చెబుతోంది. ఈ మధ్యకాలంలో షూటింగ్‌లో బిజీగా ఉండడంతో క్షణం తీరిక లేకుండా గడుపుతోందట. తన కోరికలను నెరవేర్చుకోలేకపోతోందట. షాపింగ్‌కు వెళ్ళాలన్నా సమయం అస్సలు సరిపోవడం లేదట.
అయితే ఎంత బిజీగా ఉన్నా షూటింగ్ స్పాట్లో తన గదికి వెళ్ళి ప్రశాంతంగా కాసేపు కూర్చుని ఒక ఒక కప్పు కాఫీ తాగితే ఫ్రీ అయిపోతానంటోంది మిల్కీ బ్యూటీ. ఒక కాఫీ తాగిన తరువాత తనను షూటింగ్‌లో ఎంతసేపు పనిచేయమన్నా చేయడానికి సిద్థమంటోంది.
అయితే నాలుగు గంటలకు ఒకసారి గదికి వెళ్ళి తాపీగా కూర్చుని కాఫీ తాగితేనే తనకు రిలీఫ్‌గా ఉంటుందని చెబుతోంది తమన్నా. అందుకే తమన్నాతో సినిమా తీసే నిర్మాతలందరూ ఆమె కోసం ప్రత్యేకంగా ఒక కాఫీ మిషన్‌ను తీసుకొచ్చి అందుబాటులో పెడుతుంటారని సినీవర్గాలు చెబుతున్నాయి.