శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 6 నవంబరు 2018 (11:20 IST)

విశాల్‌తో మూడోసారి జతకట్టనున్న తమన్నా..

తమన్నా మళ్లీ విశాల్‌తో మరోసారి కలిసి స్క్రీన్‌ని షేర్ చేసుకునేందుకు సిద్ధమవుతోంది. విశాల్‌ హీరోగా దర్శకుడు సుందర్‌ సి. ఓ సినిమాను రూపొందించడానికి ప్లాన్‌ చేస్తున్నారు. విశాల్‌ మార్క్‌ మాస్‌ యాక్షన్‌, కామెడీ అంశాల మేళవింపుగా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్‌ వర్క్‌ జరుగుతోంది. డిసెంబర్‌లో ప్రారంభం కానున్న ఈ చిత్రంలో విశాల్‌ సరసన కథానాయికగా తమన్నాని ఫైనల్‌ చేసినట్టు సమాచారం. 
 
గతంలో విశాల్‌, తమన్నా కలిసి ''కత్తి సండై'' చిత్రంలో నటించారు. ఇది మంచి విజయం సాధించింది. వీరికిది రెండో సినిమా. సుందర్‌ సి. దర్శకత్వంలో విశాల్‌ గతంలో ''మదగజరాజా'', ''ఆంబల'' చిత్రాల్లో నటించారు. వీరి కాంబినేషన్‌లో రాబోతున్న మూడో చిత్రమిది. 
 
కాగా.. తమన్నా చేతిలో ప్రస్తుతం అరడజను సినిమాలున్నాయి. ప్రస్తుతం 'సైరా నరసింహారెడ్డి', 'ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌', 'ఎన్టీఆర్‌: కథానాయకుడు', 'దేవి 2', 'దట్‌ ఈజ్‌ మహాలక్ష్మి', 'కన్నె కలైమానె' చిత్రాల్లో నటిస్తుంది. 'ఎన్టీఆర్‌ - కథానాయకుడు'లో జయప్రద పాత్రలో మెరవనుంది.