స్టార్ హీరోలు తేనీటి విందు చేసిన వేళ
Pawan Kalyan, Prabhas, Amitabh
ప్రభాస్ తన తాజా సినిమా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. అదేవిధంగా అమితాబ్ కూడా అదే ప్రాజెక్ట్ `కె` షూట్‌లో వున్నారు. ఆ పక్కనే
ఫ్లోర్‌లో పవన్ కళ్యాణ్ `భీమ్లానాయక్`కు చెందిన పేచ్ వర్క్ నిన్నటితో ముగిసింది. ఈ ముగ్గురు ఉదయమే షూటింగ్ కు ముందుగానే కలిసి బ్రేక్ ఫాస్ట్ చేయడం విశేషం. ఇది అక్కడివారికి కన్నుల పండవగా అనిపించింది. ఈ ముగ్గురు ఒకేసారి టిఫిన్ తినడం తెలిసిన ఫిలింసిటీ యాజమాన్యానికి చెందిన ప్రముఖులు వచ్చి వడ్డించడం విశేషం.
అమితాబ్ షూటింగ్ చేస్తున్నారని పవన్ తెలుసుకున్నారు. అమితాబ్ బచ్చన్ ను పవన్ స్వయంగా వెళ్లి కలిశారు. అమితాబ్ కూడా ఉన్న ప్రభాస్ పవన్ ను రిసీవ్ చేసుకున్నారు. ఈ ముగ్గురూ కలిసి అల్పాహారం కూడా చేశారు. తెలుగు సినిమా రంగానికి సంబంధించిన సినిమా విశేషాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది. తన సినిమా ఈనెల 25న విడుదలవుతుందని పవన్, అమితాబ్ తెలియజేశారు. ఆల్ ది బెస్ట్ అంటూ అమితాబ్ అన్నారట.
తర్వాతి కథనం
