1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Why Jayasudha rejected Jabardasth judge?

ఆ షోనా.. దణ్ణం పెట్టిన జయసుధ.. ఎందుకు?

Jayasudha
జబర్దస్త్ గురించి తెలియని వారుండరు. ఈటీవీలో ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోను లక్షలాదిమంది అభిమానులు ఉన్నారు. ఇందులో నటించిన ఆర్టిస్టులకు మంచి పేరే ఉంది. న్యాయనిర్ణేతలుగా ఉన్న రోజా, నాగబాబుల గురించి అయితే అసలు చెప్పనక్కర్లేదు. వారిద్దరి క్రేజ్ ఈ షోతో అమాంతం పెరిగిపోయింది.
 
అయితే రాజకీయాల్లో ఇద్దరూ బిజీగా ఉన్నారు. రోజా వైసిపి నుంచి పోటీ చేయగా నాగబాబు జనసేన నుంచి పోటీ చేసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో షోకు న్యాయనిర్ణేతల గురించి కొంతమందిని ఎంచుకున్నారు. అందులో జయసుధ కూడా ఒకరు. జయసుధను కలిసినప్పుడు ఆమె జబర్దస్త్ షోకి నేను చేయాలా అని దణ్ణం పెట్టేశారట.
 
ఆ షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తే నాకున్న పేరు మొత్తం పోతుంది. తెలుగు సినీ పరిశ్రమలో నాకంటూ ఒక గౌరవం ఉంది. అది పోగొట్టుకోవాలనుకోలేదు. ప్లీజ్ నన్ను వదిలేయండి అంటూ దణ్ణం పెట్టేశారట జయసుధ. దీంతో రోజా స్థానంలో మీనాను, నాగబాబు స్థానంలో శేఖర్ మాస్టర్‌ను తీసుకున్నారట. 
తర్వాతి కథనం
పవర్ స్టార్‌తో గొడవ నిజమే.. రేణూ దేశాయ్ అడిగిన ప్రశ్నకు అలీ