బాలీవుడ్‌కు వెళ్లే ఆలోచన లేదు: ఛార్మి
బాలీవుడ్ ఛాన్సులు ఎప్పుడెప్పుడు వస్తాయా? అంటూ ఎదురుచూస్తోన్న ప్రస్తుత హీరోయిన్ల మధ్య, టాలీవుడ్ ఛార్మింగ్ బ్యూటీ, ఛార్మీ మాత్రం బాలీవుడ్‌కు వెళ్లే ఆలోచనే లేదంటోంది. టాలీవుడ్లోనే చాలా హ్యాపీగా ఉన్నానని ఆమె అంటోంది. తెలుగులో మంత్ర, మనోరమ వంటి లేడిఓరియెంటెడ్ పాత్రలతో పాటు కథానాయికగా ఛార్మి తన హవాను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా విడుదలైన మనోరమ చిత్రంలో విభిన్న పాత్రను పోషించిన ఛార్మి, త్వరలో తెరపైకి రానున్న "కావ్యాస్ డైరీ" చిత్రంలో నటించింది. సూపర్ స్టార్ కృష్ణ గారి కుమార్తె మంజుల నిర్మాణంలో ఛార్మి, మంజుల ఇద్దరూ కలిసి నటించిన "కావ్యాస్ డైరీ"లో ఛార్మి టైటిల్ పాత్ర పోషిస్తోంది.
ఈ నేపథ్యంలో.. టాలీవుడ్లో అగ్రకథానాయికగా పేరు సంపాదించిన ఛార్మిని బాలీవుడ్ అవకాశాలు వస్తే.. వెళ్తారా? అని అడిగితే. ఇప్పటి వరకు ఆ ఆలోచన లేదంటోంది. టాలీవుడ్లోనే బిజీబిజీగా ఉన్నానని, ఈ వాతావరణమే తనకెంతో నచ్చిందని ఛార్మి చెప్పింది.