సంబంధిత వార్తలు
- సెంటిమెంట్ గా ముందుగానే ఓవర్ సీస్ లో జనక అయితే గనక రిలీజ్ : దిల్ రాజు
- ఆడియెన్స్ నుంచి జనక అయితే గనక చిత్ర రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నా: నిర్మాత దిల్ రాజు
- హీరో, విలన్ గా డ్యూయల్ రోల్ చేయాలని ఉంటుంది- స్టంట్స్ నేనే చేశాను : రక్షిత్ అట్లూరి
- ఇక్కడ లాస్ట్ ఛాన్స్ అనేది ఏమీ ఉండదు అంటున్న విశ్వక్ సేన్
- తండ్రి కుర్చీ కోసం ఆశపడటం లేదు.. కానీ : హీరో విజయ్ (Video)
డిస్ట్రిబ్యూటర్‌గా మారిన నటుడు సుహాస్
Suhas, Sangeerthana
సుహాస్ మాట్లాడుతూ.. ఈ సినిమా మీద నాకు చాలా నమ్మకం ఉంది. అందుకే ఈ మూవీతో డిస్ట్రిబ్యూటర్‌గా మారుతున్నా. ఓవర్సీస్‌లో ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. నాకు ఇంత మంచి పాత్ర, సినిమాను ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. సంగీర్తనను చూశాక అందరూ ఆమె ఫ్యాన్స్ అవుతారు. అక్టోబర్ 12న మా చిత్రం రాబోతోంది. ఆద్యంతం నవ్వుతూనే ఉంటారు. నవ్వుతూనే థియేటర్ బయటకు వెళ్తారు. అందరూ చూడండి అని అన్నారు.
దిల్ రాజు మాట్లాడుతూ, సుహాస్ మీలో ఒకడిగా ఉండేవాడు.. మీ జిల్లా వాడు. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదిగాడు. డైరెక్టర్ సందీప్, సంగీర్తన ఇలా కొత్త వాళ్లతో దిల్ రాజు ప్రొడక్షన్స్‌లో నిర్మించిన ఈ చిత్రం పెద్ద హిట్ కాబోతోంది. సినిమా చూసి అందరూ నవ్వుకుని బయటకు వస్తారు. అందరినీ నవ్వించేలానే చిత్రం ఉంటుంది. పండుగ రోజు రిలీజ్ అవుతున్న ఈ చిత్రాన్ని చూసి అందరూ ఆనందిస్తారని ఆశిస్తున్నాను అని అన్నారు.
