గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 2 జులై 2021 (11:40 IST)

వ‌రుణ్ తేజ్ విడుద‌ల‌చేసిన‌ `బొమ్మ‌ల‌కొలువు`లుక్

Bommala koluvu
హ్రిషికేష్‌, మాళ‌వికా స‌తీష‌న్, ప్రియాంక శ‌ర్మ ప్ర‌ధాన‌పాత్ర‌ల‌లో రూపొందుతోన్న చిత్రం `బొమ్మ‌ల‌కొలువు. సుబ్బు వేదుల ద‌ర్శక‌త్వంలో ఏవీఆర్ స్వామి నిర్మిస్తున్నారు. శివ‌మ్ మ‌ల్హోత్రా, సుబ్బు వేదుల కీల‌క పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు. రుధ్ర‌, రాగ‌, గుణ అనే మూడు పాత్ర‌ల‌చుట్టూ తిరిగే ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్ల‌ర్ స‌బ్జెక్ట్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది.

ఈ మూవీ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను ఈ రోజు వ‌రుణ్ తేజ్ విడుద‌ల‌చేసి టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈశ్వ‌ర్ సినిమాటోగ్రాఫ‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ చిత్రానికి ప‌ర్విన్ ల‌క్క‌రాజు సంగీత ద‌ర్శ‌కుడు. ఎంఆర్ వ‌ర్మ ఎడిట‌ర్‌.
న‌టీన‌టులు: హ్రిషికేష్‌, మాళ‌వికా స‌తీష‌న్, ప్రియాంక శ‌ర్మ, శివ‌మ్ మ‌ల్హోత్ర, సుబ్బు వేదుల
సంగీతం: ప్రవీణ్ ల‌క్క‌రాజు, ఎడిట‌ర్‌: ఎంఆర్ వ‌ర్మ‌, స్టంట్స్: రాబిన్ సుబ్బు, లిరిక్స్‌: శ్రీ‌నివాస మౌళి.