గురువారం, 5 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 18 మే 2021 (12:36 IST)

మళ్లీ రిపీట్ కానున్న ఫిదా కాంబో.. వరుణ్ తేజ్.. సాయిపల్లవి..?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సాయి పల్లవి ప్రధాన పాత్రలలో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రం ఫిదా. ఈ చిత్రం ప్రేక్షకులని ఎంత ఫిదా చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా వరుణ్‌, సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులకి బాగా నచ్చింది. ఇప్పుడు వీరిద్దరు మరోసారి జంటగా అలరించేందుకు సన్నద్దమైనట్టు తెలుస్తుంది. 
 
ప్రస్తుతం వరుణ్ తేజ్ ఎఫ్‌3, గని చిత్రాలతో బిజీగా ఉండగా, ఈ రెండు పూర్తయ్యాక 'ఛలో, భీష్మ' సినిమాలతో హిట్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న వెంకీ కుడుములతో ఓ మూవీ చేయనున్నట్టు సమాచారం.
 
ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తైందని, వీలైనంత తొందరగానే మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట. అయితే ఈ సినిమాకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ ఇప్పుడు వైరలవుతోంది. 
 
ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన ఫిదా ఫేం సాయిపల్లవిని ఎంపిక చేసారని, మరోసారి ఈ జంట తెరపై ఫుల్ ఫన్ క్రియేట్ చేయనున్నారని అంటున్నారు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ నిర్మించనున్నట్లు సమాచారం.