1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Breaking : Simbu-Nayanthara Secret Marriage ?

అన్నయ్య శింబుకు నయనతారనే సరైన జోడీ.. శింబు బ్రదర్ కురళరసన్!

కోలీవుడ్ హీరో శింబు లవ్ స్టోరీపై శింబు తమ్ముడు కురళరసన్ స్పందించాడు. శింబు జంటగా నయనతారే సూపర్ సెలక్షన్ అని కురళరసన్ ఏమన్నాడంటే..? రీల్ లైఫ్ శింబుకు సరైన జోడీ నయన్ మాత్రమేనని కురళరసన్ తెలిపాడు. ఈ కుర్

Breaking : Simbu-Nayanthara Secret Marriage ?
కోలీవుడ్ హీరో శింబు లవ్ స్టోరీపై శింబు తమ్ముడు కురళరసన్ స్పందించాడు. శింబు జంటగా నయనతారే సూపర్ సెలక్షన్ అని కురళరసన్ ఏమన్నాడంటే..? రీల్ లైఫ్ శింబుకు సరైన జోడీ నయన్ మాత్రమేనని కురళరసన్ తెలిపాడు. ఈ కుర్రాడు మ్యూజిక్ ఇచ్చిన మూవీ ఇదు నమ్మ ఆళులో వీళ్లిద్దరే హీరో హీరోయిన్స్. అప్పట్లో వల్లభన్ సినిమా టైం నుంచి శింబు-నయనతారలు మంచి ఫ్రెండ్స్ అన్న కురళరసన్.. తనను కూడా తీసుకుని రెస్టారెంట్స్‌కి వెళ్లేవారని తెలిపాడు.
 
ఆ తర్వాత వీళ్లిద్దరి మధ్య వచ్చిన గ్యాప్ రావడంతో.. నయన్ తమ ఇంటికి రావడం మానేసిందన్న కురళరసన్.. ఇప్పుడు తిరిగి మాట్లాడుకుంటున్నట్లు తెలిపాడు. చివర్లో మాత్రం తన అన్నతో ఎంతమంది హీరోయిన్స్ నటించినా.. అతనికి సరైన పెయిర్ నయన్ మాత్రమే అని మరోసారి క్లారిటీ ఇచ్చాడు కురళరసన్. 
 
ఇదిలా ఉంటే.. మ‌యూరి త‌ర్వాత న‌య‌న‌తార రీసెంట్‌గా మ‌రో హారర్ మూవీలో యాక్ట్ చేస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో వ‌స్తోన్న ఈ చిత్రానికి మురగదాసు రామస్వామి దర్శకుడు. తెలుగులో ఈ చిత్రాన్ని సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యాన‌ర్‌పై ప్రముఖ నిర్మాత మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు.
About Writer
Selvi
తర్వాతి కథనం
జూలై 9న వెంకటేష్ - మారుతిల 'బాబు బంగారం' రిలీజ్