1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Chiyan vikram says good bye for cinema

చియాన్ విక్రమ్ సినిమాలకు బై చెప్పేశారా? అసలు సంగతేంటి?

Chiayan vikram
చియాన్ విక్రమ్‌కు సంబంధించి ఓ వార్త కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. విక్రమ్ తనయుడు ధృవ్ టాలీవుడ్ సంచలనం అర్జున్ రెడ్డి తమిళ్ రిమేక్ 'వర్మ' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో.. విక్రమ్ సినిమాలకు బై చెప్పేశాడని వార్తలు వస్తున్నాయి. ధృవ్ నటించిన వర్మ సినిమా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఈ నేపథ్యంలో విక్రమ్ సినిమాలకి గుడ్ బై చెప్పి.. తనయుడు కెరీర్ పై ఫోకస్ పెడతారనే ప్రచారం జరుగుతోంది. 
 
కానీ ఈ ప్రచారంలో నిజం లేదని విక్రమ్ పీఆర్వో స్పందించారు. సినిమాల నుంచి విక్రమ్ తప్పుకుంటున్నారనే వార్తల్లో నిజం లేదన్నారు. ప్రస్తుతం విక్రమ్ కోబ్రా సినిమాలో నటిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. అలాగే ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో నటిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
ఉదయ్ కిరణ్ కోటీశ్వరుడు.. భార్య విషితపైనే అనుమానం.. శ్రీదేవి