1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. drugs case, why subba raju BP down?

సిట్ అధికారులకు చుక్కలు చూపించిన సుబ్బరాజు... అవి చూపగానే పడిపోయాడు... ఏంటవి?

డ్రగ్స్ కేసులో సినీ నటులను విచారిచడంపై ఇపుడు టాలీవుడ్ ఇండస్ట్రీ కుతకుతలాడుతోంది. దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రస్తుతానికి లైన్లోకి వచ్చేశారు. సినీ నటులను నేరస్తులుగా చూస్తున్నారంటూ సిట్ పైన ఓ స్థాయిలో మండిపడ్డారు. ఇదే కేసులో మిగిలినవారిని కూడా ఇలాగే విచ

drugs case
డ్రగ్స్ కేసులో సినీ నటులను విచారిచడంపై ఇపుడు టాలీవుడ్ ఇండస్ట్రీ కుతకుతలాడుతోంది. దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రస్తుతానికి లైన్లోకి వచ్చేశారు. సినీ నటులను నేరస్తులుగా చూస్తున్నారంటూ సిట్ పైన ఓ స్థాయిలో మండిపడ్డారు. ఇదే కేసులో మిగిలినవారిని కూడా ఇలాగే విచారిస్తారా అంటూ ప్రశ్నించారు. కాగా సుబ్బరాజు ఇచ్చిన సమాచారంతో మరికొంతమంది గుట్టు రట్టయిందని తెలుస్తోంది. 
 
మరోవైపు సుబ్బరాజు తొలుత సిట్ అధికారులకు సమాధానాలివ్వకుండా చుక్కలు చూపించినట్లు సమాచారం. దాంతో విసిగిపోయిన సిట్ అధికారులు ఆధారాలతో సహా కొన్నింటిని బయటపెట్టడంతో ఇక సుబ్బరాజు నోరు తెరవక తప్పలేదు. దాంతో ఆయన ముందు పలు ప్రశ్నలను సంధించారు. ఆ ప్రశ్నల దెబ్బకు సుబ్బరాజు బీపీ డౌన్ అయి పడిపోయాడని తెలుస్తోంది. సుబ్బరాజుకు వేసిన ప్రశ్నలేంటంటే... 
 
* మీకు డ్రగ్స్ అలవాటు ఉందా? 
 
* మీకు ఎంత మంది ఈవెంట్ ఆర్గనైజర్లు తెలుసు?
 
* సినీ పరిశ్రమలో ఎవరెవరికి డ్రగ్స్ అలవాటు ఉంది? 
 
* పూరీ జగన్నాథ్ తో సన్నిహితంగా ఉంటారా? 
 
* పూరీ ఎప్పుడైనా డ్రగ్స్ తీసుకున్నారా? 
 
* పూరీతో కలిసి బ్యాంకాక్ వెళ్లినప్పుడు ఏ ఫోన్ నెంబర్లు వాడారు? అక్కడ ఏం చేశారు? 
 
* అక్కడ పూరీ విదేశీ నెంబర్లు వాడారు.. మీకు తెలుసా? 
 
* కెల్విన్ తెలుసా? ఎలా పరిచయం అయ్యాడు? పూరీ - శ్యామ్‌లతో పాటు మీరూ కెల్విన్ ని కలిసే వారా?
 
* పూరీ ఇంట్లో పార్టీలో ఏం జరిగేది? మీరు డ్రగ్స్ పార్టీ లకు వెళ్లేవారా?
 
* కెల్విన్‌కు మీరు ఎవరెవరిని పరిచయం చేశారు?

ఇత్యాది ప్రశ్నలు వేయడంతో సుబ్బరాజు బీపీ ఒక్కసారిగా డౌన్ అయిపోయి కూలబడినట్లు తెలుస్తోంది. దీనితో ఆయనకు కాస్త విరామం ఇచ్చి మళ్లీ ప్రశ్నాస్త్రాలు సంధించారట సిట్ అధికారులు.
About Writer
ivr
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి
తర్వాతి కథనం
టాలీవుడ్‌ డ్రగ్స్ కేసు... హీరో తరుణ్ వాటిని ఆశ్రయించాడా?(వీడియో)