సంబంధిత వార్తలు
- టాలీవుడ్లో ఐటీ దాడుల కలకలం.. హీరో నాని ఇంట్లో కూడా సోదాలు
- నాని - వంశీ జాగ్రత్త... మావయ్యను వ్యక్తిగతంగా దూషిస్తే సహించం : నందమూరి చైతన్యకృష్ణ
- ద్యావుడా, దోమ తెరల వెనుకాల కోట్ల రూపాయల కట్టలు, ఎక్కడ?
- రాష్ట్రం ఏమైనా నీ అబ్బ జాగీరా? నాని.. ఏంది నీ భాష : బీద రవిచంద్ర
- ఆయనకు ఇబ్బంది.. అందుకే ఎన్టీఆర్ను పక్కనబెట్టేశారు.. కొడాలి నాని
హీరో నాని ఇంట్లో సన్ సైడ్ పైన నోట్ల కట్టలున్నాయా?
ఉదయం నుంచి ఆదాయపు పన్నుశాఖ అధికారులు సినీ ప్రముఖుల ఇంటిలో సోదాలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అందులోను ప్రముఖ నిర్మాత రామానాయుడు స్టూడియోతో పాటు సురేష్ ప్రొడక్షన్ కార్యాలయంలోను సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం 25 మంది ఐటీ శాఖ అధికారులు ఈ సోదాల్లో పాల్గొంటున్నారు.
మరోవైపు అనూహ్యంగా ఐటీ శాఖ అధికారులు ప్రముఖ నటుడు నాని ఇంటిపైన సోదాలు ప్రారంభించారు. ఉదయం 10 గంటల నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. జూబ్లిహిల్స్ లోని నాని నివాసం, అలాగే ఆయనకు సంబంధించిన కార్యాలయాలపైన సోదాలు జరుపుతున్నారు.
నాని ఈ మధ్యకాలంలో హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే ఐటీ రిటర్న్స్ సరిగ్గా చెల్లించలేదన్న ఆరోపణలు నేపథ్యంలో ఐటీ శాఖ అధికారులు సోదాలను కొనసాగిస్తున్నారు. కోట్ల రూపాయల డబ్బులను నాని ఇంటిలో స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం 2 వేల నోట్లతో పాటు 500 రూపాయల నోట్లు కూడా సన్ సైడ్ మీద ఐటీ అధికారులు గుర్తించారట. ఎలాంటి రసీదులు లేని ఆ డబ్బును ఐటీ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
