1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Kollywood Producers fire on Nayanthara

నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న నయనతార?!

Nayanthara
మలయాళ బొమ్మ నయనతార. అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్‌లో రాణిస్తూ లేడీ అమితాబ్‌గా గుర్తింపు తెచ్చుకుంది. గతంలో ఇద్దరితో ప్రేమలో మునిగితేలిన ఈ ముద్దుగుమ్మ ఇపుడు ఆ ఇద్దరితో తెగదెంపులు చేసుకుని తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమాయణం నడుపుతోంది. అదేసమయంలో ఆమె నిర్మాతలకు చుక్కలు చూపిస్తోందట. 
 
ఈ విషయాన్ని తమిళ నిర్మాత రాజన్ తాజాగా వెల్లడించారు. ఈ నిర్మాత చేసిన వ్యాఖ్యలు ఇపుడు కోలీవుడ్‌లో కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా, నయనతార ప్రవర్తన వల్ల ఖర్చు విపరీతంగా పెరిగిపోతున్నట్టు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా, లగ్జరీ హోటళ్ళలో బస చేయడం వల్ల ఈ అమ్మడి వ్యక్తిగత ఖర్చు తడిసిమోపెడవుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. 
 
ఈ వ్యాఖ్యలు ఇపుడు తమిళ చిత్రపరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి. నిజానికి నయనతారపై ఇప్పటికే నిర్మాతలు చాలా మంది ఆగ్రహంతో ఉన్నారు. సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉంటోంది. దీనిపై నిర్మాతలు కక్కలేక మింగలేక ఉంటూ వచ్చారు. ఇపుడు ఆమె చేస్తున్న దుబారా ఖర్చుపై నిర్మాత చేసిన వ్యాఖ్యలతో మిగిలిన నిర్మాతలు కూడా స్పందించే అవకాశాలు లేకపోలేదు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
35 యేళ్ళ వయస్సులోను ఏమాత్రం అందం తగ్గని హీరోయిన్