Mamitha Baiju hospitalzed: మమితా బైజు ఆసుపత్రిలో చేరిక, ఓనమ్ వేడుకలు వాయిదా !
Updated: Wed, 2 Sep 2026 (15:56 IST)
మలయాళ నటి మమితా బైజు తెలుగులోనూ అందరికీ సుపరిచతమే. విశ్వనాథ్ అండ్ సన్స్ తో మరింత దగ్గరైంది. అంతకుముందు పలు సినిమాలలో నటించింది. తాజాగా ఆమె అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యుల సలహా మేరకు ప్రస్తుతం తాను పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నట్లు మమిత స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు.
ఆమె అస్వస్థత కారణంగా ఆస్ట్రేలియా పర్యటన రద్దయింది. మెల్‌బోర్న్‌లో జరగబోయే 'క్లైడ్ ఓనమ్ 2026' వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉంది. అయితే మమిత హెల్త్ కండిషన్ సరిగ్గా లేకపోవడంతో, నిర్వాహకులు ఈ వేడుకలను వాయిదా వేశారు.
ఆమె నాయికగా నటించగా బ్లాక్బస్టర్ అయిన మలయాళం సినిమా 'బెత్లెహాం కుటుంబ యూనిట్' సెప్టెంబర్ 4న తెలుగులో రిలీజ్ అవుతోంది.
దేవీ (మురళీకృష్ణ)
నిక్‌నేమ్- శక్తిమాన్
సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక......
మరింత చదవండి