1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. manchu vishnu talk relation with ys jagan mohan reddy

జగన్‌తో కలిసి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో కలిసి చదువుకున్నాం : మంచు విష్ణు

Manchu Vishnu
సుమంత్ హీరోగా నటించిన తాజా చిత్రం 'న్యూటన్స్ థర్డ్ లా' ప్రమోషన్‌లో భాగంగా, ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తనకున్న అనుబంధం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తామిద్దరూ 'హైదరాబాద్ పబ్లిక్ స్కూల్' (హెచ్పీఎస్)లో కలిసి చదువుకున్నామని, ఆ రోజుల జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. జగన్ చిన్న వయసు నుంచే నాయకత్వ లక్షణాలు స్పష్టంగా కనిపించేవని సుమంత్ వెల్లడించారు.
 
ఈ సందర్భంగా సుమంత్ మాట్లాడుతూ, "జగన్ నాకు స్కూల్లో రెండేళ్లు సీనియర్. అయినా మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉండేది. మా బాండింగ్ చాలా బలంగా ఉండేది. తరచూ కలిసి సినిమాలకు, రెస్టారెంట్లకు వెళ్లేవాళ్లం. స్కూల్ కార్యక్రమాల్లో కూడా కలిసి పాల్గొనేవాళ్లం" అని తెలిపారు. జగన్ అప్పట్లో తమ స్కూల్ హౌస్ కెప్టెన్‌గా ఉండేవారని, ఆయనలో నాయకత్వ లక్షణాలు అప్పటి నుంచే కనిపించేవని చెప్పారు.
 
"జగన్ చాలా ప్రశాంతంగా, అదేసమయంలో చాలా ధైర్యంగా వ్యవహరించేవారు. అతను ఖచ్చితంగా రాజకీయాల్లోకి వెళ్తాడని, నేను సినిమాల్లోకి వస్తానని మా స్నేహితులందరూ అప్పుడే ఊహించేవారు. చివరకు మేమిద్దరం అనుకున్న రంగాల్లోనే స్థిరపడ్డాం" అని సుమంత్ వివరించారు.
 
అయితే, తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి ఏమాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు. "రాజకీయాలు చాలా బాధ్యతాయుతమైనవి. ఆ రంగంలో రాణించాలంటే సహజంగానే ఆసక్తి, అంకితభావం అవసరం. నాకు ఆ ఆసక్తి లేదు. రాజకీయాల్లో నాకు చాలామంది మిత్రులు ఉన్నారు, వారిని గౌరవిస్తాను. కానీ నేను మాత్రం ఆ రంగానికి సరిపోను" అని సుమంత్ స్పష్టం చేశారు.
 
వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కలిసే అవకాశం రాలేదని, కానీ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఒకసారి కలిశానని సుమంత్ తెలిపారు. స్కూల్ పూర్తయ్యాక కెరీర్ల పరంగా ఇద్దరి దారులు వేరు కావడంతో తరచూ కలుసుకోవడం తగ్గిపోయిందని పేర్కొన్నారు. తమ పాఠశాల హెచ్.పి.ఎస్ నుంచి సినీ పరిశ్రమకు తన మామ నాగార్జున, తాను, తన జూనియర్ అయిన రానా దగ్గుబాటి, దర్శకుడు నాగ్ అశ్విన్‌తో పాటు మరెందరో వచ్చారని సుమంత్ గుర్తు చేసుకున్నారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
ది మేజ్ నుంచి నన్నే నన్నే.. అనే మెలోడీ సాంగ్ ను ఆవిష్కరించిన ఆనంద్ దేవరకొండ