1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Manoj Helping on his birthday

పుట్టిన‌రోజున మ‌నోజ్ సాయం

Manchu Manoj
Manchu majoj
క‌రోనాబారిన ప‌డిన వారికి మాన‌వ‌తా దృక్ప‌థంతో సాయం చేయ‌డానికి మంచు మ‌నోజ్ ముందుకు వ‌చ్చాడు. మ‌నోజ్ పుట్టిన‌రోజు నేడే. కరోనా కారణంగా దేశంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో మంచు మనోజ్ 25,000 కుటుంబాలకు సాయం అందించడానికి ముందడుగు వేశారు. ఈ విష‌యాన్ని ఆయ‌న సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించారు. దానికి మంచి స్పంద‌న వ‌స్తోంది.
 
ఇలాంటి సమయంలోనే మాస్కులు ధరించి, తరచూ శానిటైజ్ చేసుకుంటూ మన ప్రపంచాన్ని మనమే కాపాడుకోవాలి. నా వంతుగా ఈ పుట్టిన రోజున నేను, నా అభిమానులు, మిత్రులు కలిసి ఈ కరోనా వల్ల ప్రభావితమైన 25 వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందించి నా వంతు సహాయం చేస్తూ, ఇలాగే కొనసాగించాలి అనుకుంటున్నాను. ఈ కష్టమైన సమయంలో దయచేసి ఇంట్లో ఉండి మనల్ని మన కుటుంబాన్ని కాపాడుకుందాం. స్టే హోమ్, స్టే హ్యాపీ, బీ పాజిటివ్ సదా నా ప్రేమతో మీ మంచు మనోజ్” అంటూ ఓ బహిరంగ లేఖను విడుదల చేశాడు మంచు మనోజ్.ఆయనకు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
About Writer
ముర‌ళీకృష్ణ‌
తర్వాతి కథనం
తొలి విడ‌త‌ద‌గా 500 ఆక్సిజ‌న్ ల‌ను అంద‌జేసిన న‌మ్రత‌