బట్టల రామస్వామిని అభినందించిన మోహన్‌బాబు
Narayan-Mohanbabu
ఇదంతా ఒకెత్తయితే మంచు మోహన్‌బాబు సినిమాను చూసి దర్శకుడు రామ్ నారాయణ్‌ను పిలిపించుకుని అభినందించటం విశేషం. తనకు సినిమా ఎంతగానో నచ్చిందంటూ సినిమా షూటింగ్ విశేషాలను, ఎన్ని రోజుల్లో సినిమాను తెరకెక్కించారు, ఎక్కడెక్కడ చిత్రీకరణ చేశారు అని అనేక విషయాలను అడిగి తెలుసుకున్నారట.
ఈ సందర్భంగా దర్శకుడు రామ్ నారాయణ్ మాట్లాడుతూ, నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. కరోనా సమయం అయినప్పటికీ సినిమా నచ్చటంతో నిన్ను వ్యక్తిగతంగా అభినందించాలి అని పిలిపించాను అన్నారు. మోహన్‌బాబు గారి వంటి లెజెండ్ మా సినిమాను చూసి అభినందనలు చెప్పటం అది ఆయన గొప్పతనం. సినిమా చూసిన ఎంతోమంది సినీ ప్రముఖులు నాకు ఫోన్ చేసి మెచ్చుకున్నారు. కానీ, మోహన్‌బాబు గారు సన్నాఫ్ ఇండియా సినిమా రిలీజ్ హడావిడిలో ఉండి కూడా నన్ను పిలిపించి మాట్లాడటంతో ఇది మా సినిమాకు దక్కిన గొప్ప విజయంగా నేను భావిస్తున్నా అన్నారు.

