1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Nayanthara Conditions On Godfather Casting

నయనతారకు టెక్ ఎక్కువే.. ఆ హీరోను అవమానించిందట!

Nayanthara
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో చిరుకు నయనతార చెల్లెలిగా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే . ఇందులో నయనతారకు భర్తగా సత్యదేవ్‌ని ఎంచుకున్నారు సినిమా మేకర్స్. 
 
కానీ తనతో భర్త గా నటించే అర్హత సత్యదేవ్‌కు లేదని ఎవరైనా సీనియర్ నటుడిని పెట్టాలని నయనతార కండిషన్ పెట్టినట్లు టాలీవుడ్‍‌లో వార్తలు వినిపిస్తున్నాయి. 
 
ఈ చిత్రంలో చిరంజీవి తర్వాత అంతటి పవర్ ఫుల్ రోల్ సత్యదేవ్ కి మాత్రమే ఉంటుందని దర్శకుడు చెప్పినట్లు సమాచారం. ఇకపోతే మలయాళంలో సూపర్ హిట్ సినిమాగా తెరకెక్కిన లూసిఫర్ సినిమాకు రీమేక్‌గా ఈ గాడ్ ఫాదర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 
 
ఇక ఈ సినిమాలో మోహన్ లాల్ హీరోగా నటిస్తుండగా ఆయనకు చెల్లెలి పాత్రలో మంజు వారియర్ నటించింది. ఇక ఆమె భర్తగా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కీలక పాత్ర పోషించారు.  
తర్వాతి కథనం
నన్ను ఒక్కడు పక్కలో పడుకోమని ఆఫరిచ్చాడు.. హీరోయిన్స్, యాంకర్స్ ?