1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Oka manasu release on June 24

హృద్యమైన ప్రేమకథగా ''ఒక మనసు'' జూన్ 24న విడుదల!

Oka manasu
నిహారిక కొణిదెల నాగ శౌర్య జంటగా, TV9 సమర్పణలో, మధుర ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామరాజు దర్శకత్వంలో మధుర శ్రీధర్ రెడ్డి నిర్మించిన ఒక మనసు చిత్రం జూన్ 24 న విడుదలకు సిద్ధమవుతోంది. ఇటివలే మెగా హీరోల చేతుల మీదుగా విడుదలైన పాటలకు శ్రోతలనుండి విశేష స్పందన లభిస్తోందని, సినిమా ఫస్ట్ లుక్ మొదలుకుని ఇటివలే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ వరకూ ప్రేక్షకుల నుంచి లభిస్తున్న అనూహ్యమైన స్పందన తమకెంతో ఆనందాన్ని కలిగిస్తుందని చిత్ర నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి తెలిపారు. 
 
ఇప్పటి రొటీన్ చిత్రాలకి విభిన్నంగా ఒక హృద్యమైన ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రంలో నిహారిక, నాగ శౌర్యల నటన ఆకట్టుకుంటుందనీ, ప్రేమ, కుటుంబం, బాధ్యతలు వాటి విలువలు లాంటి అంశాలతో ముడిపడివున్న ఈ ఒక మనసు సినిమా ప్రతి మనసుని అలరిస్తుందని, సునీల్ కశ్యప్ బాణీలు అందించిన ఈ చిత్రాన్ని జూన్ 24 వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని దర్శకుడు రామరాజు తెలిపారు.
About Writer
DV
తర్వాతి కథనం
ఎన్టీఆర్ ఘాట్‌కి వెళ్లి అడ్వాన్స్‌గా నివాళులు అర్పించిన జూనియర్ ఎన్టీఆర్... ఎందుకు?