సంబంధిత వార్తలు
- Visakhapatnam: విశాఖపట్నంలో మెట్రో రైలు సేవలు... ప్రారంభానికి ఏపీ సన్నాహాలు
- ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు
- Ajay Devgn : నేను డ్యాన్స్‌ని యాక్షన్‌గా చూస్తా : జాకీ చాన్
- Sandeep Vanga: అర్జున్ రెడ్డిలా మారిన సందీప్ రెడ్డి.. దీపికాపై ఫైర్.. ఇదేనా మీ ఫెమినిజం అంటూ ఫైర్
- దేశంలో వెయ్యి దాటిన కరోనా కొత్త కేసులు - కొత్త వేరియంట్లపై భయమా?
Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన
Actor Ali
అలీ స్పందిస్తూ.. ఎస్వీ కృష్ణారెడ్డి బర్త్డే రోజున రాజేంద్రప్రసాద్ గారిది మాట తూలింది. సరదాగా అన్నారు. దీన్ని తీసుకుని మీడియా మిత్రులు వైరల్ చేస్తున్నారు. అమ్మలాంటి కూతురు చనిపోయింది. అది భర్తీచేయలేనిది. అమ్మలాంటి అమ్మ చనిపోయింది. కనుక పెద్దాయన అన్నాడని ఊరుకోండి. కావాలని చెప్పింది మాత్రం కాదు. దయచేసి ఇంకా ఎవరూ కూడా రచ్చ చేయకండి.. అంటూ వివరించారు.
అసలు జరిగింది ఇదే..
ఆదివారంనాడు వేదిక దగ్గరలో ఉన్న నటులు అలీని ఉద్ధేశించి ఆ లం కొడుకు అంటూ, రోజాని నేనే పరిచయం చేశాను, ఏ ఆమని నీకు గుర్తుందిగా మనం మిస్టర్ పెళ్లాం టైమ్‌లో అని ఆమనిని, ఇది చూడండి గుండ్రాయిలా తయారయింది అంటూ రవళిని తన స్టైల్లో సరదాగా మాట్లాడుతున్నాను అనుకున్నారు కానీ అవన్నీ లైవ్‌లో మీడియాకి చేరటంతో అనుకోని అనర్థం జరిగిపోయింది. ముఖ్యంగా స్టేజ్ పైనున్న అచ్చిరెడ్డి గారిని మనం కిందకి వెళ్లిన తర్వాత మాట్లాడుకుందాం అంటూనే పక్కనున్న సీనియర్ నటులు మురళీమోహన్‌గారిని ఉద్ధేశించి నీకు సిగ్గుండాలి అనటంతో అందరూ అవాక్కయ్యారు.
30 ఏళ్ల క్రితం ఉన్న మీడియా వేరు ఇప్పటి మీడియా వేరు...మనం ఏ స్టేజ్‌పై ఉన్నా , ఏ స్టేజ్‌లో ఉన్నా నోటిని అదుపులో పెట్టుకుని సందర్భోచితంగా మాట్లాడటం అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోదగిన నిజం. అలా మనం మాట్లాడకపోతే మనలోని పాజిటివ్ విషయాలు, సింపతి కలిగిన విషయాలు కూడా పక్కదారి పట్టడం ఖాయం. మైక్ దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మనం దొరికిపోవటం ఖాయం. అంటూ వ్యాఖ్యానించుకున్నారు.
