పూజా కార్యక్రమాలతో రైస్ మిల్ మూవీ ప్రారంభం
Rice Mill pooja
ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. రైస్ మిల్ చిత్ర పూజా కార్యక్రమాలు ఈ రోజు నిర్వహించడం జరిగింది. విలేజ్ లైఫ్‌కి సడెన్‌గా వచ్చే అర్బన్ లైఫ్‌కి మధ్య తేడాని బేస్ చేసుకుని ఫ్యామిలీ అండ్ యూత్ ఫుల్ డ్రామాగా ఈ చిత్రం ఉంటుంది. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. చరణ్ అర్జున్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రతి ఒక్కరూ బ్లెసింగ్స్ అందిస్తారని ఆశిస్తున్నాము. ఇంకో 10, 15 రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది అని తెలిపారు.
హీరో హేమంత్ కుమార్ మాట్లాడుతూ.. శ్రీ మహా ఆది కళాక్షేత్రం బ్యానర్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో హీరోగా ఛాన్స్ ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు. ఈ రైస్ మిల్ స్టోరీ యూత్‌ని ఆకర్షించే విధంగా ఉంటుంది. ప్రేక్షకుల ఆశీస్సులు కావాలి అని అన్నారు.
సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ మాట్లాడుతూ.. దాదాపు సంవత్సరం నుండి ఈ టీమ్‌తో ట్రావెల్ అవుతున్నాను. ఇది నాకు హోమ్ బ్యానర్ వంటిది. ఫోన్‌లోనే మహేష్ గారు నాకు ఈ కథ వినిపించారు. చాలా బాగా నచ్చింది. ఈ సినిమాకు సంగీతం ఇచ్చేందుకు నేను కూడా ఎంతో ఎగ్జయిటింగ్‌గా వెయిట్ చేస్తున్నాను. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు రావాలని, సినిమా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. అని తెలిపారు.
