సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 18 అక్టోబరు 2022 (09:15 IST)

స్మార్ట్ ఫోన్ల వ్యాపారంలోకి ఎలన్ మస్క్.. పేరు.. 'పై ఫోన్' ధరెంతంటే?

Tesla
Tesla
స్మార్ట్ ఫోన్ల వ్యాపారంలోకి ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ అడుగుపెడుతున్నారు. ఇందులో భాగంగా ఎలన్‌కు  చెందిన విద్యుత్ ఆధారిత వాహనాల సంస్థ టెస్లా ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు కూడా తయారుచేస్తోంది. త్వరలోనే టెస్లా స్మార్ట్ ఫోన్ ప్రపంచ మార్కెట్లోకి రానుంది. ఈ ఫోన్‌కు సంబంధించిన వివరాలు లీక్ అయ్యాయి. 
 
టెస్లా స్మార్ట్ ఫోన్‌ను 'పై ఫోన్' గా పిలుస్తున్నారు. నూనె, జిడ్డు మరకల నుంచి రక్షణ కోసం స్క్రీన్ కు ఒలియోఫోబిక్ కోటింగ్ ఉంటుంది. 6.7 అంగుళాల ఓఎల్ఈడీ స్క్రీన్‌తో వస్తోంది. ఈ స్క్రీన్ స్క్రాచ్ రెసిస్టెంట్, గ్లాస్ ప్రొటెక్షన్ కలిగి ఉంటుంది. ఇప్పుడున్న స్మార్ట్ ఫోన్‌ల కంటే ఓ మెట్టు పైనే ఉండేలా ఇందులో శాటిలైట్ ఫోన్ నెట్వర్క్ కనెక్టివిటీ ఫీచర్ కూడా ఉంటుందని తెలుస్తోంది. 
 
స్పెసిఫికేషన్స్
3 రియర్ కెమెరాలు, ఒక ఫ్రంట్ కెమెరా
రియర్ కెమెరాలు 50 మెగాపిక్సెల్ సామర్థ్యం కలిగినవి. ఫ్రంట్ కెమెరా కెపాసిటీ 40 ఎంపీ.
5,000 ఎంఏహెచ్ బ్యాటరీ  
ధర రూ.80 వేల వరకు ఉండొచ్చని అంచనా.