1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Singer Sunitha strong reply to netizen

సింగర్ సునీత భర్తపై నెటిజన్ కామెంట్, దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన సునీత

Singer Sunitha
ఫోటో కర్టెసి- ఇన్‌స్టాగ్రాం
సింగర్ సునీత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటారు. ఆమె హాజరయ్యే ఈవెంట్లకు సంబంధించిన విశేషాలను ఆమె ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటారు. అలాగే రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లోని శ్రీరామనగరంలో సమతా విగ్రహం వద్ద ఆమె తన భర్తతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసారు. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందించారు. ఐతే ఓ నెటిజన్ సింగర్ సునీత భర్తపై అనుచిత వ్యాఖ్యలు పోస్ట్ చేసాడు.

 
కాకి ముక్కుకు దొండపండు. సునీతకు ముసలి రామ్ మొగుడు. అందం ఈమె సొంతం. ధనము ఆయన సొంతం. గానం ఈవిడది, దర్జా అతనిది అంటూ పోస్ట్ చేసాడు. దీనిపై సింగర్ సునీత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. గంగాధర రావు... నోటి దూల నీది. నీ భారం భూమిది అని పోస్ట్ చేసారు. ఈ కామెంట్ చూసిన సునీత ఫ్యాన్స్... సూపర్ రిప్లై మేడమ్ అంటున్నారు.
About Writer
ఐవీఆర్
తర్వాతి కథనం
2022తో వెండితెరకు గుడ్ బై, ఇక సినిమాల్లో నటించనంటున్న కమెడియన్ రాహుల్