బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 25 జనవరి 2022 (15:06 IST)

వివాదంలో మ్యాంగో యూట్యూబ్ : చిక్కుల్లో సింగర్ సునీత భర్త?

ప్రముఖ యూట్యూబ్ చానెల్ మ్యాంగో వివాదంలో చిక్కుంది. దీంతో ఈ చానెల్ అధినేత రామ్ వీరపనేని ఇపుడు చిక్కుల్లో పడినట్టు సమాచారం. ఈయన టాలీవుడ్ ప్రముఖ సింగర్ సునీత భర్త. రామ్ వీరపనేనిని సునీత్ ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. ఈయన మ్యాంగో యూట్యూబ్ చానెల్‌ను నిర్వహిస్తున్నారు. 
 
ఈ చానెల్‌లో పోస్ట్ చేసిన కొన్ని వీడియోలలో గౌడ వర్గానికి చెందిన మహిళలను వేశ్యలుగా చిత్రీకరించారంటూ గౌడ కుల సంఘాలు ఆరోపిస్తూ ఆందోళనకు దిగాయి. పైగా, ఈ వీడియోలను తక్షణం తొలగించాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఈ వార్తల్లో నిజమెంతో ఆ యూట్యూబ్ చానెల్ వర్గాలు స్పందించాల్సివుంది.