డ్రైవింగ్ లైసెన్స్` కోసం ఎదురుచూస్తున్న వెంకీ!
Venky
తాజాగా `అసురన్` అనే సినిమాను `తెలుగులో `నారప్ప`గా చేసేశాడు. అది ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వుండగానే మలయాళంలో `దృశ్యం2`ను కూడా ఈ ఏడాదిలోనే ప్రారంభించేశాడు. ఆ సినిమాకూడా కరోనా సెకండ్ వేవ్‌కల్లా పూర్తిచేసేశాడు. ఇప్పుడు తను ఖాళీ వుండకుండా మరో రీమేక్‌పై కన్నేశాడు. మలయాళంలోనే `డ్రైవింగ్ లైసెన్స్` అనే వచ్చింది. లాల్ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమాలో పృథ్వీరాజ్ కుమార్ నటించాడు. అది మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు వెంకటేష్ ఆ సినిమాను చేసే పనిలో వున్నాడు. ఆ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇది సురేష్ సంస్థలో వుండబోతున్నది సమాచారం.
తర్వాతి కథనం
