ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (12:14 IST)

ఉగాది స్పెషల్.. పంచెకట్టులో #Narappa.. చీరకట్టులో ప్రియమణి

Narappa
విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న చిత్రం నారప్ప. తమిళ సినిమా అసురన్‌కు రీమేక్‌గా రూపొందుతున్న ఈ సినిమాను మే14న ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నారప్ప భార్య పాత్రలో ప్రియమణి నటిస్తున్నారు. 
 
అద్భుత తారాగణంతో నారప్ప సినిమాను కలైపులి యస్ ధను, సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన ఈ సినిమా పోస్టర్లు మంచి ఆదరణ పొందాయి. ఉగాది సందర్భంగా మరో పోస్టర్ విడుదల చేశారు.
 
తాజా పోస్టర్‌లో వెంకటేష్ పంచెకట్టులో కనిపించి ఫ్యాన్స్‌కు అమితానందం కలిగిస్తున్నారు. రాజీవ్ కనకాల, ప్రియమణి కూడా పోస్టర్‌లో కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలోని కీలక సన్నివేశాలను రాయలసీమలోని అనంతపూర్ పరిసర ప్రాంతాల్లోని రియలిస్టిక్ లొకేషన్లలో చిత్రీకరించారు.