తప్పు చేశాం.. క్షమించండి.. ఆ విషయాన్ని మర్చిపోయాం: విఘ్నేశ్
Nayanatara
"తిరుమలలో పెళ్లి చేసుకోవాలన్నదే తమ కోరిక. అందుకే గత నెల రోజుల్లో తిరుమలకు ఐదుసార్లు వచ్చాం. కానీ అనివార్య కారణాల వల్ల మహాబలిపురంలో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది.
దీంతో పెళ్లి అయిన వెంటనే నేరుగా తిరుమలకు వచ్చి స్వామివారి కల్యాణ సేవలో పాల్గొనేందుకు వచ్చామని.. అదే ఆలోచనలో స్వామి వారి దర్శనానికి తర్వాత చెప్పులేసుకుని వచ్చేశామని విక్కీ తెలిపారు.
దర్శనం తర్వాత ఆలయం ముందు ఫోటోలు తీసుకున్నది.. మా పెళ్లి ఎప్పటికీ గుర్తుండిపోవాలనే ఉద్దేశంతోనేనని విఘ్నేశ్ చెప్పారు. ఆ హడావుడిలోనే చెప్పులున్న సంగతిని మర్చిపోయామని వెల్లడించారు.
