1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
  4. Arjuna Phalguna Teaser Release

శ్రీవిష్ణు నటించిన 'అర్జున ఫల్గుణ' టీజర్ రిలీజ్

Arjuna Phalguna
యంగ్ హీరో శ్రీవిష్ణు వరుసగా విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కమర్షియల్ చట్రంలో ఇరుక్కుపోకుండా తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్గంలో పయనిస్తున్నారు. తాజాగా ఈ హీరో మరో సరికొత్త కథతో సినీ ప్రియులను ఆలరించేందుకు సిద్ధమయ్యాడు.
 
'అర్జున ఫల్గుణ' అనే టైటిల్‌తో ఓ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. తాజాగా మేకర్స్ ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. 
 
ఈ యాక్షన్ ప్యాక్డ్ టీజర్‌లో శ్రీవిష్ణు ఒక ప్రత్యేక మిషన్‌లో డాషింగ్ మ్యాన్‌గా కనిపిస్తున్నాడు. శ్రీవిష్ణు స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్స్ చాలా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది. 
 
దర్శకుడు తేజ మార్ని అడవికి సంబంధించిన విజువల్స్‌ను ఆకట్టుకునే రీతిలో ప్రదర్శించారు. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్న “అర్జున ఫల్గుణ” టీజర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది.

 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
పూర్ణతో మితిమీరి ప్రవర్తించలేదు.. మూడు సినిమాలు చేసింది...?: రవిబాబు