శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సినీ ఆవకాయ్
Written By ivr
Last Modified: గురువారం, 8 డిశెంబరు 2016 (14:42 IST)

ప్రధాని మోదీ నోట్ల రద్దుతో... పేరూ ఊరూ లేని పెద్ద హీరో భార్య కోట్ల బంగారాన్ని కొనేసిందట...

కొన్ని వార్తలు భలే తమాషాగా ఉంటాయి చెప్పుకోవడానికి. రాసుకోవడానికీనూ... పేరు లేకుండా ఆ హీరోయిన్ ఇంత, ఈ హీరో అంత, ఆ హీరోయిన్ రాత్రి అక్కడ, ఈ హీరోతో ఆ హీరోయిన్ కులుకుతోంది, నైట్ పార్టీలో పట్టుబడ్డ హాట్ హీరోయిన్, పిజ్జా సెంటర్లో రాత్రంతా ఆ జంట రేయింబవళ్లు

కొన్ని వార్తలు భలే తమాషాగా ఉంటాయి చెప్పుకోవడానికి. రాసుకోవడానికీనూ... పేరు లేకుండా ఆ హీరోయిన్ ఇంత, ఈ హీరో అంత, ఆ హీరోయిన్ రాత్రి అక్కడ, ఈ హీరోతో ఆ హీరోయిన్ కులుకుతోంది, నైట్ పార్టీలో పట్టుబడ్డ హాట్ హీరోయిన్, పిజ్జా సెంటర్లో రాత్రంతా ఆ జంట రేయింబవళ్లు ఏదేదో చేసేశారు... ఇత్యాది వార్తలు, గుసగుసలకు కొన్ని సైట్లు ప్రధాన భూమికను పోషిస్తుంటాయని ఏకంగా టాలీవుడ్ సినీ సెలబ్రిటీలే ఎన్నోసార్లు మండిపడ్డారు. 
 
తాజాగా ఓ టాప్ హీరో భార్య నోట్ల రద్దు ప్రకటించగానే సంచులకు సంచుల డబ్బులు(పాతనోట్లు) కార్లో వేసుకుని వెళ్లి హైదరాబాద్ నగల దుకాణం పడిందట. కోట్ల రూపాయల్లో బంగారాన్ని కొనేసిందట. పాత నోట్లను వదిలించుకున్నదట. ఐతే ఆ నటి ఎవరయ్యా అంటే క్వచ్చన్ మార్క్. టాప్ హీరో భార్య కోట్ల బంగారం అనగానే జనం గబుక్కున వస్తారనే లాజిక్కు తప్ప అందులో పస ఏముందీ... ఐతే ఇలాంటి వార్తలపై టాలీవుడ్ ఇండస్ట్రీ ఎలా స్పందిస్తుందో...?