శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : గురువారం, 8 డిశెంబరు 2016 (14:20 IST)

చైతూను లెక్కచేయని సమంత... కొత్త చిత్రానికి సమ్మతం... మరి పెళ్లి మాటేంటి?

తన ప్రియుడు నాగ చైతన్య మాటను ప్రేయసి సమంత తుంగలో తొక్కింది. ఈ కుర్ర హీరో చెప్పిన మాటను ఏమాత్రం పట్టించుకోకుండా మరో చిత్రంలో నటించేందుకు సమంత సమ్మతిస్తూ సంతకం పెట్టేసింది. టాలీవుడ్‌ ప్రేమజంటగా మారిన చై

తన ప్రియుడు నాగ చైతన్య మాటను ప్రేయసి సమంత తుంగలో తొక్కింది. ఈ కుర్ర హీరో చెప్పిన మాటను ఏమాత్రం పట్టించుకోకుండా మరో చిత్రంలో నటించేందుకు సమంత సమ్మతిస్తూ సంతకం పెట్టేసింది. టాలీవుడ్‌ ప్రేమజంటగా మారిన చైతూ - సమంతలు వచ్చే యేడాది పెళ్లి పీటలెక్కనున్న విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'జనతా గ్యారేజ్‌'లో సమంత ఓ హీరోయిన్. ఈ చిత్రం తర్వాత ఏ తెలుగు సినిమాకు సంతకం చేయలేదు. దీంతో నాగచైతన్యతో పెళ్లి నేపథ్యంలో ఆమె మెల్లమెల్లగా నటనకు స్వస్తి పలుకుతున్నారనే వార్తలు వచ్చాయి. ఈ వార్తలు కేవలం పుకార్లేనని తేలిపోయింది.
 
దీనిపై  సమంత స్పందిస్తూ.. మంచి కథలు వస్తే నటిస్తానని, కేవలం ఆ కారణంగానే ఏ సినిమాకు సంతకం చేయడం లేదని చెప్పారు. దీని తర్వాత రెండు తమిళ చిత్రాలకు సంతకం చేసిన సమంత తెలుగులో మాత్రం ఏ ప్రాజెక్టును ఒప్పుకోలేదు. అయితే తాజాగా తెలుగు అభిమానులకు శుభవార్త చెబుతూ.. సమంత ఓ ట్వీట్‌ చేశారు. తాను నటించబోయే ఆసక్తికరమైన ప్రాజెక్టుల గురించి త్వరలో ప్రకటించనున్నానని తెలిపారు.
 
అయితే ఓ అభిమాని 'తెలుగు? తమిళం?' అని ప్రశ్నించగా.. 'తెలుగు' అని సమాధానం ఇచ్చారు సమంత. రామ్‌చరణ్ ‌- సుకుమార్‌ కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రంలో సమంతను కథానాయికగా అనుకుంటున్నట్లు చిత్ర వర్గాల సమాచారం. అలాగే, ఎన్టీఆర్ ‌- బాబీ కలయికలో సినిమా వస్తోందని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. ఇందులో కూడా సమంతను హీరోయిన్‌గా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. మొత్తంమీద ఈ రెండు చిత్రాల్లో ఒక చిత్రంలో సమంత నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.