1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Dubai Crown Prince stops using his Mercedes SUV. And the reason is the cutest

భళా ప్రిన్స్... పావురానికో గూడు.. అందుకోసం దుబాయ్ రాజు ఏం చేశారంటే...

Dubai Crown Prince
దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఆ రాజు చేసిన పనికి నెటిజన్లు జేజేలు పలుకుతున్నారు. పావురం గూడు కోసం ఏకంగా అత్యంత ఖరీదైన కారు వాడకాన్ని కూడా పక్కనబెట్టేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను కూడా ఆయన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. దీనిపై వీక్షించిన నెటిజన్లు ఇపుడు ప్రశంసలు కురిపిస్తున్నారు. 
 
నిజానికి నేటి కాలంలో బాల‍్కనీలోకి పక్షులు రాకుండా నెట్‌లు వేసుకుంటున్నారు. కానీ, పావురం గూడు కోసం ఖరీదైన కారును కూడా దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ పక్కనబెట్టేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్‌కు చెందిన మెర్సిడెస్ బెంజ్‌ ఎస్‌యూవీ విండ్‌షీల్డ్‌పై ఒక పావురం జంట గూడు చేసుకొని, గుడ్లు కూడా పొదగడం ప్రారంభించింది. ఈ విషయాన్ని గమనించిన ప్రిన్స్ ఆ గూడుకు ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ముందుగా కారును వాడకూడదని నిర‍్ణయించుకున్నారు. అలాగే కారు చుట్టూ రక్షణ వలయాన్ని కూడా ఏర్పాటు చేయడం విశేషం. 
 
అంతేకాదు దీనికి సంబంధించిన టైమ్‌ ల్యాప్‌ వీడియోను ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. కొన్నిసార్లు జీవితంలో చాలా చిన్న విషయాలు సరిపోతాయంటూ కమెంట్‌ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. పోస్ట్ చేసిన 24 గంటల వ్యవధిలోనే 10 లక్షలకు పైగా వ్యూస్‌ను సాధించింది.
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
పవన్ కళ్యాణ్‌లో ఏమిటీ మార్పు, జనసైనికుల్లో ఎందుకంత ఆగ్రహం?