దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ మెర్సిడెస్ కారుపై పక్షి గూడు.. ఆయన ఏం చేశారంటే?
దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ మెర్సిడెస్ కారుపై ఓ పక్షి గూడు కుట్టుకుంది. అయితే ఆ గూడును తొలగించేందుకు వారిని మనసురాలేదు. దీంతో కొన్ని రోజుల పాటు కారుని గ్యారేజ్ లోనే ఉంచి పక్షి గుడ్లు పొదిగి పిల్లలు అయి ఎగిరిపోయేంత వరకు కారుని కదిలించలేదు. రాజు మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రకృతి ప్రేమికుడు.
తన మెర్సిడెస్-ఎఎమ్‌జి జి 63 ఎస్‌యువిని కారుపై పక్షి గూడు కట్టుకుందని, పక్షికి ఇబ్బంది కలగకుండా ఉండటానికి అతను తన సిబ్బందికి ఆ ప్రాంతానికి దూరంగా ఉండమని చెప్పారు. కొన్ని సార్లు చిన్న చిన్న విషయాలే చాలా ఆనందాన్ని ఇస్తాయని చెబుతూ తన కారుపై పక్షి గూడు కట్టుకుని గుడ్లు పెట్టిన విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు దుబాయ్ ప్రిన్స్.
పక్షి ఆ గుడ్లను పొదిగి పిల్లలను అయిన వీడియోను నెటిజన్స్‌తో పంచుకున్నారు. పక్షి లగ్జరీ కారుపై గూడు కట్టుకుని తన పిల్లలను చూసుకుంటోందని రాశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇంకా రాజుగారికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.