అది దగ్గుబాటి ఫ్యామిలీకి సంబంధించిన కారే కాదు
రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండలో దగ్గుబాటి అభిరామ్ కారు ప్రమాదానికి గురైందనీ, ఎదురుగా వస్తున్న కారును ఆయన కారు ఢీకొట్టిందనీ మీడియాలో, ఆన్‌లైన్‌లో జరుగుతున్న ప్రచారాన్ని అభిరామ్ కుటుంబసభ్యులు ఖండించారు.
అది కేవలం వదంతి మాత్రమేననీ, మీడియాలో చూపిస్తున్న కారు అసలు దగ్గుబాటి ఫ్యామిలీకి సంబంధించినది కాదనీ వారు స్పష్టం చేశారు. ఈ విషయంలో దయచేసి వదంతులను నమ్మవద్దని, వాటిని ప్రచారం చేయవద్దని వారు కోరారు.