ఆ దోసె పోయడం చూస్తే తినాలనిపిస్తుందంతే, చూడండి వీడియో
దోసెలు పోయడాన్ని కూడా కళాత్మకంగా పోస్తున్నారు ఓ పెద్దాయన. రుచిగా వుండటమే కాదు, దోసెలను పోయడం కూడా ఎంతో ఆకట్టుకునేలా పోస్తున్నారాయన. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ పెద్దాయన బండిలో అట్లు పోసే బండపైన అట్లు పోస్తున్నారు.
పోసినవి పోసినట్లు చకచకా ప్లేట్లలోకి విసిరేస్తుంటే ఆయనకు సహాయకుడిగా వున్న వ్యక్తి వాటిని సరిగ్గా పట్టేసి తినేవారికి అందిస్తున్నారు. ఇది ఏ ప్రాంతంలో వున్నదో తెలియదు కానీ... అట్లు చూస్తుంటే మాత్రం అద్భుతః అన్నట్లు వున్నాయి. చూడండి ఆ వీడియోను..
These two are out of control pic.twitter.com/qitj2godFf
— A Man Of Memes (@RickyDoggin) March 30, 2026
