1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Lalitha Jewellery MD Kiran Kumar at road side shop

లలితా జ్యూవెల్లరీ ఎండీ రోడ్డుపై ఏం చేశారో తెలుసా?

Kiran
Kiran
ఎన్నో జ్యూవెలరీ షాపులు వున్న లలితా జ్యూవెల్లరీ షాప్ తీరు వేరు. ఆ షాపుకు ఎండీనే బ్రాండ్ అంబాసిడర్. తనే  ప్రచారాన్ని స్వయంగా చేస్తుంటారు. యాడ్స్ అంటూ ప్రత్యేకంగా ఏం చేయరు. ఆయనే లలిత జ్యువెలరీ అధినేత కిరణ్ కుమార్.
 
ఇప్పుడు ఆయన గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే.. ఆయన నెల్లూరు జిల్లాలో ఓ దోశ బండి దగ్గర దోశ తింటున్న దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. 
 
కిరణ్ కుమార్ వయసు 50ఏళ్ళు. 1985లో మొదట చెన్నైలో లలిత జ్యువెలర్స్ షోరూం ప్రారంభించారు. ఆయన పెద్దగా చదువుకోలేదు కానీ 1999లో లలిత జ్యువెలర్స్ సంస్థను కిరణ్ కుమార్ టేకోవర్ చేశారు. 
 
ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వంలా కిరణ్ కుమార్ నెల్లూరులో దోశ బండి దగ్గర దోశ తింటున్న దృశ్యాలు ఆశ్చర్య పరిచాయి. ఈ ఫోటోలు ప్రస్తుతం ట్రెండింగ్ అవుతున్నాయి. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
రూ.15 లక్షలు చెల్లించాలని స్మితా సభర్వాల్‌కు హైకోర్టు ఆదేశం