హోమ్ వర్క్ గురించి అడిగితే.. టీచర్ చీర బాగుందన్న బుడ్డోడు
Boy
స్కూల్ యూనిఫామ్‌లో ఉన్న ఓ స్టూడెంట్.. టీచర్‌తో మాట్లాడుతున్నాడు. టీచర్ అందరి హోమ్ వర్క్ చెక్ చేస్తున్న సమయంలో ఈ బుడ్డోడి వంతు వచ్చింది. హోం వర్క్ చూపించాలని కోరితే ఆ బాలుడు వింత సమాధానాలు చెప్పాడు.
మీరు చీర కట్టుకుని వచ్చినప్పుడు చాలా అందంగా కనిపిస్తున్నారని టీచర్‌కు చెప్పడాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. ఆ చీర చాలా బాగుందని ప్రశంసించాడు. అంతేకాకుండా మీరే నా ఫేవరెట్ టీచర్ అని కాంప్లిమెంట్ కూడా ఇచ్చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
होमवर्क से बचने के उपाय... pic.twitter.com/2JqFkCtOyL
— सुनील पंवार (@Sunilpanwar2507) August 18, 2022
