శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 ఆగస్టు 2022 (16:40 IST)

అమ్మా ఆకలేస్తోంది.. లేవకపోవటంతో ఏడ్చాడు.. చివరికి?

బీహార్ రాష్ట్రంలోని భాగల్ పుర్ రైల్వే స్టేషన్‌లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. రైల్వే ప్లాట్ ఫాంపై కన్నతల్లి చనిపోయింది. ఆ విషయం తెలియని ఐదేళ్ల కుమారుడు అమ్మ మెడ చుట్టూ చేతులువేసి ఒడిలో నిద్రపోయాడు. 
 
కొద్దిసేపటికి లేచి అమ్మా ఆకలేస్తోంది అంటూ చెప్పినా అమ్మ లేవకపోవటంతో ఏడ్వటం మొదలు పెట్టాడు. ప్రయాణికులు ఇచ్చిన సమాచారంతో భాగల్ పుర రైల్వే పోలీసులు మహిళ మృతి చెందిన ప్రదేశానికి వచ్చి ఆమె మృతదేహాన్నిపోస్టుమార్టం నిమిత్తం మార్చరీకి తరలించారు. 
 
చిన్నారిని శిశు సంరక్షణ కేంద్రం అధికారులకు అప్పగించారు. అయితే మృతురాలి వివరాలు తెలుసుకోవడానికి తల్లీ కుమారుడి ఫొటోలను పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. 
 
అయినా ఎవరూ సంప్రదించక పోవటంతో గురువారం పోలీసులే ఆ మహిళలకు అంత్యక్రియలు నిర్వహించారు. మృతురాలి మరణానికి గల కారణాలు పోస్టుమార్టం నివేదిక వచ్చాక తెలుస్తాయని అధికారులు తెలిపారు.