సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 2 ఆగస్టు 2022 (12:02 IST)

జనగామ చిన్నారి మృతి కేసు.. కన్నతల్లే హంతకురాలు

baby legs
జనగామ చిన్నారి మృతి కేసులో కన్నతల్లే హంతకురాలని పోలీసులు తేల్చారు. తనే సంపులో వేసి పాపను హత్య చేసినట్లు తల్లి ఒప్పుకోవడంతో జనగామ చిన్నారి మృతి కేసులో మిస్టరీ వీడింది. పాప ఎదుగుదల లేకపోవడంతో తల్లి ప్రసన్న హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
 
అయితే చిన్నారి తల్లి ప్రసన్న ఘటన జరిగిన తర్వాత స్థానికులకు చెప్పిన కథ మరోలా ఉంది. దీంతో పోలీసులకు అనుమానం రావడంతో, ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. తల్లి ఓ కట్టు కథ అల్లినట్లుగా పోలీసులు గుర్తించారు. 
 
చిన్నారి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల దర్యాప్తులో తల్లి ప్రసన్న పొంతన లేని సమాధానాలు చెప్పడం పలు అనుమానాలకు తావిచ్చింది. పసికందు సంపులో పడిపోయిందని ఆమె ముందుగా స్థానికులకు చెప్పారు. 
 
కాసేపటికి మాటమార్చి చైన్ స్నాచింగ్‌కు యత్నించిన వ్యక్తి పసికందును సంపులో పడేశాడంటూ చెప్పారు. ప్రసన్న పొంతన లేని జవాబులతో కుటుంబసభ్యులను పోలీసులు విచారించారు. దీంతో తానే చిన్నారిని సంపులో పడేసి చంపినట్లు తల్లి ప్రసన్న పోలీసుల ముందు ఒప్పుకుంది.