మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 2 ఆగస్టు 2022 (11:20 IST)

కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు స్టాలిన్ సాయం.. నో స్కూల్ ఫీజ్!

తమిళనాడులో కరోనాతో తల్లిదండ్రులను పొగొట్టుకున్న పిల్లలను ఆదుకునేందుకు సీఎం స్టాలిన్ ప్రభుత్వం ముందుకొచ్చింది. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు 18 ఏళ్లు వచ్చేంత వరకు రూ.5 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయనున్నారు. 
 
అలాగే తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయిన చిన్నారులకు రూ.3 లక్షల సాయం ప్రకటిస్తామని స్టాలిన్ తెలిపారు. వారి చదువు బాధ్యతను ప్రభుత్వమే పూర్తిగా తీసుకుంటుందని.. స్కూలు, కాలేజీలో ఫీజులు వుండవని సీఎం వెల్లడించారు. నెలకు రూ.3 వేల పెన్షన్ తరహాలో పిల్లల పేర అకౌంట్ డిపాజిట్ వుంటుంది. 
 
ఇప్పటికే కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. కోవిడ్‌తో అనాథలైన పిల్లలకు ఉచిత విద్య అందించనుంది. అలాగే ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై నెల నెలా స్టైఫండ్ వచ్చేలా చర్యలు తీసుకుంది.
 
ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై నెల నెలా స్టైఫండ్ వచ్చేలా చర్యలు తీసుకుంది. 23 ఏళ్లు వచ్చే వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై స్టైఫండ్ అందజేయనుంది కేంద్రం. ఆయుష్మాన్ భారత్ కింద ఐదు లక్షల ఉచిత ఆరోగ్య బీమా అందజేయనున్నారు. అనాథ పిల్లలకు ఉచిత విద్యకు విద్యారుణానికి సంబంధించి కేంద్రమే వడ్డీ చెల్లించనుంది.