ఈ దేశ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని తు.చ తప్పకుండా నెరవేర్చుతానని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఆయన గురువారం ఉదయం న్యూఢిల్లీలోని ఎర్రకోటపై 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగింస్తూ, భారతావని మారుతోందని, ప్రతి భారత పౌరుడూ దేశాభివృద్ధి నిమిత్తం తనవంతు కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నాడని అన్నారు. 2019 ఎన్నికల తర్వాత ఎర్రకోటపై నుంచి...