సంబంధిత వార్తలు
- సూర్య గ్రహణం.. ధనుస్సు రాశి వారు ఇలా చేయాల్సిందేనా?
- సూర్యగ్రహణం : ఆలయాలు క్లోజ్... గ్రహణ సమయంలో ఏం చేయకూడదు... (Video)
- సూర్యగ్రహణం : ఆలయాలు క్లోజ్... గ్రహణ సమయంలో ఏం చేయకూడదు...
- సూర్యగ్రహణం రోజున చేయాల్సినవి.. చేయకూడనవి? 6 గ్రహాలు ఒకటైతే.. ధనుస్సు రాశికి?
- సూర్యగ్రహణం.. గర్భిణీ స్త్రీలు హాయిగా నిద్రపోవడం మేలు..
సూర్యగ్రహణం పట్టినప్పుడు గుంటలో కూర్చుంటే అంగవైకల్యం తగ్గుతుందనీ...
సూర్యగ్రహణం సమయంలో కర్ణాటక రాష్ట్రంలో అమానుష ఘటన చోటుచేసు కుంది. చిన్నారులకు అంగవైకల్యం పోతుందనే మూఢనమ్మకంతో చిన్నారులను మట్టిలో పాతిపెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. సూర్యగ్రహణం సమయంలో మట్టిలో పాతి పెడితే చిన్నారుల అంగవైకల్యం పోతుందని తల్లిదండ్రులకి ఎవరో చెప్పగా అది నిజమే అనుకున్నారు. మట్టిలో పాతిపెడితే మంచిదని అలా చేయడం వలన వారి అంగవైకల్యం పోవచ్చనే నమ్మకంతో మట్టిలో పాతిపెట్టారు.
అంగవైకల్యం కలిగిన పిల్లలను గొంతు వరకు మట్టిలో కప్పి పెట్టారు తల్లిదండ్రులు, స్థానికులు.
ఈ ఘటన ఉత్తర కర్ణాటకలోని తాజ్‌సుల్తాన్‌పురాలో చోటుచేసుకుంది. పిల్లలు రోదిస్తున్నప్పటికీ గ్రహణం ముగిసే వరకు అంటే సుమారు మూడు గంటల పాటు పిల్లలను వారి తల వరకు మట్టిలోనే కప్పి ఉంచారు. అయితే ఉత్తర కర్ణాటక అంతటా ఇదే మూఢాచారం కొనసాగుతోందట.
అయితే ఈ ఘటన పైన జన విజ్ఞాన వేదిక అసహనం వ్యక్తం చేసింది. చిన్నారులను మట్టిలో పాతిపెడితే శ్వాస తీసుకునే క్రమంలో ఇబ్బందులు పడతారని అన్నారు. తల్లిదండ్రులు ఈవిధమైన మూఢ విశ్వాసాలను విడనాడాలని సూచిస్తున్నారు. స్థానికులకు ఈ మూఢ నమ్మకం నుంచి బయట పడేసేందుకు అనేకమంది ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేదని అంటున్నారు.
